- Step 1
ముందుగా కుక్కర్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, మరియు పచ్చిమిర్చి వేయాలి.
- Step 2
తర్వాత గరం మసాలా, కొత్తిమీర పౌడర్, యాలకలు, పెప్పర్ మరియు జీడిపప్పు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 3
ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసిన బీట్ రూట్, పచ్చిబఠానీలు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 4
తర్వాత ఇందులోనే ఉప్పు కూడా వేసి మూత వేయాలి . తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
- Step 5
అంతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆవిరి పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని రైతాతో సర్వ్ చేయాలి. అంతే వేడివేడి బీట్ రూట్ పీస్ పులావ్ రెడీ.