- Step 1
ముందుగా గుడ్లను ఉడికించి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. (మీకు ఇష్టమైతన ఉడికించిన గుడ్డును రెండు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు)
- Step 2
గార్నిషింగ్: స్టౌ మీద పాన్ పెట్టిఅందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
- Step 3
తర్వాత అందులోనే జీడిపప్పు మరియు ద్రాక్ష కూడా వేసి వేగించుకోవాలి.
- Step 4
తర్వాత ఒక కప్పు వేడి పాల్లో చిటికెడు కుంకుమపువ్వు వేసి వేడి పక్కన పెట్టుకోవాలి.
- Step 5
మసాల కోసం: మందపాటి గిన్నెలో నెయ్యివేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాల వేగించుకోవాలి.
- Step 6
మసాలకోసం సిద్దంగా పెట్టుకొన్న అన్ని వస్తువులను వేసి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి తర్వాత అందులోనే ఉడికించిన గుడ్లను కూడా వేసి రెండు నిముషాల వేగించాలి.
- Step 7
అన్నం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో పాన్ ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి అన్నం కోసం సిద్దం చేసుకొన్న మాసాలాలన్నింటిని అందులో వేసి వేగించి అందులోనే నీరు వంపేసి బియ్యాన్ని కూడా వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 8
తర్వాత అందులోనే చికెన్ స్టాక్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 90%అన్నం ఉడికేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
- Step 9
లేయరింగ్: ఇప్పుడు మంద పాటి పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో ఎగ్ మరియు మసాలాను మొదటి లేయర్ గా పరవాలి. తర్వాత దీని మీద అన్నంను పరవాలి.అన్నం మీదు నెయ్యిలో వేయించుకొన్న ఉల్లిపాయ, జీడిపప్పు,ద్రాక్షను పరవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి.
- Step 10
చివరి లేయర్ మీద కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను చిలకరించాలి. తర్వాత దీని మీద అల్యూమినియం సీట్ పరచి మూత పెట్టి తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి. అంతే ఎగ్ దమ్ బిర్యాని రెడీ. మీకు ఇష్టైన రైతా తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.