కాలక్రమంలో వచ్చే వాతావరణ మార్పుల పరిస్థితులకు అనుగుణంగా ఆహారపదార్థాల్లోనూ మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చలికాలంలో వేడివేడిగా అందరూ బజ్జీలు, ఇతర పదార్థాలు తయారుచేసుకుంటారు. అయితే వీటిలో నూనె కంటెంట్ ఎక్కువగా వుండటం వల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. అలా కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ.. చలిని తట్టుకునే విధంగా వుండే ఆహారాలు కూడా వున్నాయి. అందులో క్యారెట్-ఓట్ మీల్ సూప్’ను ఒకటిగా చెప్పుకోవచ్చు.
దీనిని తాగితే.. మానసిక ఒత్తిళ్లు, నీరసం మొత్తం తొలగిపోయి.. ఎంతో తాజాగా వుంటారు. ఎందుకంటే.. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు మెండుగా వున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా వుంచి, హృదయాన్ని తేలికగా వుంచుతుంది. శరీరంలో వున్న అనవసరమైన కొలెస్టిరాల్’ను తొలగించేసి.. కావలసిన కొవ్వుపదార్థాలను నిల్వ చేస్తుంది. అంటే.. ఇది కూడా శరీరానికి ఒక ఔషధగుణంలాంటిదేనన్నమాట! మరి ఇంతటి పోషకకరమైన ఈ సూప్’ను ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...