- Step 1
ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి మంట మీడియంగా పెట్టి 5-10నిముషాలు వేగించుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
అంతలోపు బంగాళదుంప ముక్కలను కూడా కావల్సిన సైజ్ లో కట్ చేసుకొని, కుక్కర్ లో వేసి ఒకటి విజిల్ వచ్చే వరకూ ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత మిక్సీలో ఉల్లిపాయ, మరియు పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
- Step 4
తర్వాత అదే ఫ్రైయింగ్ పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
- Step 6
అంతలోపు టమోటోను గుజ్జుగా తయారు చేసుకోవాలి(మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి).
- Step 7
తర్వాత వేగుతున్న మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, పసుపు వేయడం వల్ల టమోటో త్వరగా ఉడుకుతుంది.
- Step 8
ఒకసారి గా ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ కు మారగానే, టమోటో గుజ్జును అందులో వేయాలి. అలాగే కారం, టమోటో సాస్, మరియు గరం మసాలా వేసి, బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
- Step 9
ఎక్కువ మంట పెట్టి 2-3నిముషాలు ఉడకనివ్వాలి. తర్వాత మంటను మీడియంగా పెట్టి, అందులో పన్నీర్ క్యూబ్స్, ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంపలు వేసి మరో ఐదు నిముషాలు ఉడికించుకోవాలి. అంతే పన్నీర్ ఆలూ గ్రేవీ రెడీ. చివరగా కొత్తిమీరతో గార్నిస్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. రోటీ, రైస్, చపాతీలకు మంచి కాం