- Step 1
ముందుగా చేపముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తడి ఆరిన తర్వాత వాటికి ఉప్పు, పసుపు, పెరుగు, మరియు నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి 20 నిముషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత పాన్ లో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు బంగాళదుంపలను బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసి పెట్టుకోవాలి .
- Step 5
తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే జీలకర్ర, సోంపు, మెంతి, కలోంజి, ఆవాలు, ఎండు మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 7
ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో పసుపు, జీలకర్ర, మరియు కారం , సరిపడా నీళ్ళు సోయాలి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద బాయిల్ చేయాలి . తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి ఉడికించుకోవాలి. దాంతో ఆయిల్ వేరుపడుతుంది.
- Step 8
ఈ మసాలాలతోనే బంగాళదుంప చేర్చి బాగా ఉడికించుకోవాలి . దాంతో మసాలన్నీ కూడా బంగాళదుంపలకు బాగా పడుతాయి . తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
- Step 9
బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత 1/2 వాటర్ వేసి ఉడికించుకోవాలి బంగాళదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో చేపముక్కలు మరియు సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసి 5నిముషాలు ఉడికించుకోవాలి.
- Step 10
చేపముక్కలు మీడియంగా ఉడికినట్లు తెలియగానే స్టౌ ఆఫ్ చేయాలి . తర్వాత గరం మసాలా కొద్దిగా చిలకరించి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బెంగాలి ట్రెడిషినల్ ఫిష్ కాలీ రిసిపి రెడీ.