- Step 1
ముందుగా మీరు చికెన్ లాలీపప్స్ ను శుభ్రంగా కడిగి, దాని మీద పసుపు, ఉప్పు చిలకరించి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ మిశ్రమానికి పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 3
ఇప్పుడు ఈ పేస్ట్ ను ఉపయోగించి చికెన్ లాలీపప్పుకు ఫుల్ గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- Step 4
మరో బౌల్లో, కార్న్ ఫ్లోర్, మరియు మైద, బేకింగ్ సోడా, ఉప్పు మరియు నీళ్ళు పోసి, చిక్కగా కలిపి పెట్టుకోవాలి.
- Step 5
తర్వాత ఈ చిక్కటి పిండిని మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపప్స్ కు మ్యారినేట్ చేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత మరో 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి
- Step 6
తర్వాత ఈ చిక్కటి పిండిని మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపప్స్ కు మ్యారినేట్ చేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత మరో 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
- Step 7
చికెన్ లాలీపప్ప్ గోల్డ్ బ్రౌన్ కలర్ లోనికి మారుతున్నప్పుడు, ఆయిల్ నుండి చికెన్ తీసి, ఆయిల్ పీల్చుకొనే పేర్ మీద వేయాలి. అంతే మీ చికెన్ లాలీపప్స్ రెడీ .
- Step 8
ఈ రుచికరమైన చికెన్ లాలీపప్ప్ ను చైనీస్ ఫ్రైడ్ రైస్ తో తినాలి. మరింత స్పైసీ టేస్ట్ కోరుకుంటున్నట్లైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి మీర అందించాలి.