- Step 1
చికెన్ ముక్కలని ఒక గిన్నెలో తీసుకుని దానిలో పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా వెయ్యాలి.
- Step 2
ఇలా చికెన్ ముక్కలని మారినేట్ చేసి 2 గంటలపాటు పక్కనుంచాలి.
- Step 3
ఒక లోతైన మూకుడు తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడి చేసి మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని వెయ్యాలి.
- Step 4
వేయించిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్ వేసి చికెన్ సగం ఉడికే వరకూ స్టవ్ మీద ఉంచాలి.
- Step 5
ఒక పాన్ తీసుకుని దానిలో నీళ్ళు పోసి వేడి చేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు మసాలా దినుసులు వెయ్యాలి. దీనిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి 80% ఉడికించుకోవాలి.
- Step 6
ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలని ఒక లోతైన గిన్నెలో పేర్చి పైన ఉడికిన అన్నాన్ని వేసి పొరలుగా పేర్చాలి.
- Step 7
దీనిలో కుంకుమ పువ్వు నీరు, రోజ్ వాటర్,కేవ్రా వాటర్,డ్రై ఫ్రూట్స్, వేయించిన ఉల్లిపాయలు,తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి చుట్టూ అల్యూమినియం ఫాయిల్తో చుట్టాలి.
- Step 8
చికెన్ బిర్యానీని ఇంకా సహజంగా చెయ్యాలనుకుంటే గిన్నె మూతకి గోధుమ పిండి పూసి సీల్ చెయ్యాలి.
- Step 9
ఇప్పుడు బిర్యానీని ఇలా 20 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. గిన్నెలో నుంచి సువాసన వచ్చినప్పుడు స్టవ్ ఆపాలి. అంతే మీ చికెన్ బిర్యానీ రెడీ.
- Step 10
ఈ వారాతంలో కనుక మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటే చికెన్ బిర్యానీ వండి మీ అతిధులని ఆశ్చర్య పరచండి.ఈ రుచికరమైన బిర్యానీ తిని వాళ్ళెంత ఆనందిస్తారో మీరే చూద్దురుగాని.సులభంగా చేసే ఈ రుచి కరమైన ఈ చికెన్ బిర్యానీ తయారీని మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోవద్దు సుమా.