- Step 1
నువ్వులని కనీసం రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద నూనె లేకుండా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు అదే మూకుడులో నువ్వుల నూనె వేసి దానిలో అల్లం,వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.
- Step 3
అల్లం, వెల్లుల్లి వేగాకా దానిలో ఉడికించిన నూడుల్స్, సోయా సాస్, వెనిగర్ వెయ్యాలి.
- Step 4
ఇప్పుడు బాగా కలిపి పైన వేయించిన నువ్వులు కలపాలి.కాసిని నువ్వులు గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవడం మర్చిపోవద్దు సుమా.
- Step 5
ఇప్పుడు మళ్ళీ కలిపి కాసేపు స్టవ్ మీదే ఉంచాలి.
- Step 6
నూడుల్స్ ఇతర పదార్ధాలతో కలిసి బాగా ఉడికాకా నూడుల్స్‌ని నూడుల్స్ బౌల్లోకి తీసుకోవాలి.
- Step 7
వీటిమీద ఉల్లి కాడల తరుగు, గార్నిషింగ్ కోసం పెట్టుకున్న నువ్వులూ చల్లాలి.
- Step 8
అంతే మీ సీసమే నూడుల్స్ రెడీ.