- Step 1
ఒక గిన్నె తీసుకుని దానిలో మైదా,బేకింగ్ పౌడర్ కలిపి పక్కన పెట్టాలి.
- Step 2
ఇంకొక గిన్నెలో పాలు, వెన్న, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 3
ఈ పాల మిశ్రమాన్ని మొదట పక్కన పెట్టుకున్న పిండిలో పోసి మెత్తని చపాతీ పిండి లాగ కలిపి ఒక మస్లిన్ క్లాత్ వేసి ఒక 40 నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు స్టఫ్ఫింగ్ తయారు చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో తురిమిన పనీర్,ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు,కొత్తిమీర,ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కారం వెయ్యాలి.
- Step 5
అన్నింటినీ బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే,పనీర్ కుల్చాకి స్టఫ్ఫింగ్ తయారు.
- Step 6
ఇప్పుడు మస్లిన్‌క్లాత్ కప్పిన పిండి నుండి కొంచం ముద్ద తీసుకుని గుండ్రంగా వత్తుకోవాలి.మరీ పెద్దదిగా వత్తుకోకూడదు.
- Step 7
ఇప్పుడు గుండ్రంగా వత్తిన చపాతీని మీ అరచేతిలో ఉంచుకుని కొంచం స్టఫ్ఫింగ్ తీసి దీనిలో పెట్టి అంచులు మూసెయ్యాలి.
- Step 8
ఇప్పుడు పీట మీద కొంచం పిండి చల్లి స్టఫ్ చేసుకున్న ఈ ముద్దని మెల్లిగా చేతులతో తడుతూ గుండ్రంగా వత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కుల్చాలు తయారు చేసుకోవాలి.
- Step 9
ఒక ఓవెన్ ట్రే తీసుకుని దానికి కొంచెం నూనె రాయాలి. ఇలా చేస్తే కుల్చాలు ట్రేకి అతుక్కుపోవు.
- Step 10
ఓవెన్‌ని 200 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చెయ్యాలి ఇప్పుడు కుల్చాలని ట్రేలో పెట్టి 10-15 నిమిషాలు బేక్ చేసుకుంటే పనీర్ కుల్చా రెడీ. బేక్ అయిన కుల్చాలని నాలుగు ముక్కలుగా కోసి మీకిష్టమైన చట్నీతో వడ్డించడమే.