- Step 1
ఉల్లిపాయలని విడివిడిగా వచ్చేటట్లు పొరలుగా తరగాలి. ఇలా తరిగిన ఉల్లిపాయలని 15 నిమిషాలపాటు చల్లని నీటిలో నానబెట్టాలి.తరువాత నీటిలోనుండీ తీసి కిచెన్ టవల్ మీద ఆరబెట్టాలి.ఆరిన తరువాత ఒక ప్లేటులోకి మార్చి వీటి మీద పిండిని చల్లాలి.అందువల్ల ఎక్కువగా ఉన్న తేమని పిండి పీల్చుకుంటుంది.
- Step 2
ఒక పెద్ద గిన్నెలో మైదా,కారం,మిక్స్డ్ హెర్బ్స్,ఉల్లి పొడి,ఆవ పొడి,మిరియాలు,ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలపాలి.
- Step 3
ఈ పిండికి సోడా పోసి ఈ మిశ్రమం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా చిక్కగా ఉండకూడదు.
- Step 4
ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలపాలి.
- Step 5
ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ పొడి,బ్రెడ్ పొడి,తరిగిన కొత్తిమీర వేసి బగా కలపాలి.
- Step 6
ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి.
- Step 7
పొరలు పొరలుగా తరిగిన ఉల్లిపాయలని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ ,కార్న్ ఫ్లేక్స్ పొడిలో దొర్లించి ఉల్లిపాయలకి బ్రెడ్ పొడి బాగా పట్టేటట్లు చూడాలి. 8)ఇలా బ్రెడ్ పొడిలో దొర్లించిన ఉల్లిపాయలని వేడెక్కిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. .
- Step 8
వేగాకా నూనెలో నుండి తీసి కిచన్ టవల్ మీద వేస్తే ఆనియన్ రింగ్స్‌లో ఉన్న అధిక నూనెని పీల్చుకుం.