- Step 1
ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మిన్స్ ను జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలగుపుకోవాలి.
- Step 2
ఈ మొత్తం మిశ్రమం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, పిండి, గుడ్డు మరియు చిటికెడు ఉప్పు , మైదా వేసి మెత్తగా , మ్రుదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి.
- Step 3
నిముషాల తర్వాత ఈ పిండి నుండి కొద్దిగా చేతిలోకి తీసుకుని, చిన్న బాల్స్ లా చేసి, ప్లాట్ గా రోల్ చేయాలి. చపాతీల్లా చుట్టుకుని, తర్వాత మద్యలో చికెన్ స్టఫ్ ను నింపి, అన్ని వైపుల క్లోజ్ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి.
- Step 4
ఇలా కొన్ని సమోసాలు తయారుచేసుకున్న తర్వాత, డీప్ బాటమ్ పాన్ తీసుకుని, నూనె పోసి, వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సమోసాలను వేసి బంగారువర్ణంలోకి మారే వరకూ వేగించి, తీసి బౌల్లో పెట్టుకోవాలి.
- Step 5
నూనె ఎక్కువగా ఉన్నట్లైతే పేపర్ టవల్ మీద వేసి, కొద్దిసేపటి తర్వాత వేరే ప్లేట్ లోకి మార్పుకుని, వేడి వేడిగా సర్వ్ చేయాలి. . చట్నీ , సాస్ మర్చిపోకండి...