- Step 1
ముందుగా అన్నం వండిపెట్టుకోవాలి.
- Step 2
తర్వాత పాన్ లో కొద్దిగా నీళ్ళు, పసుపు మరియు ఉప్పు వేసి అందులోనే కాలీఫ్లవర్ కూడా వేసి 10నిముషాలు ఉడికించుకోవాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత నీరు వంపేసి కాలీఫ్లవర్ ను పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు తిరిగా కాలీఫ్లర్ ను మంచి నీటిలో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ చల్లారిన తర్వాత నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి.
- Step 4
పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో కాలీఫ్లవర్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 5
మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పచ్చిబఠానీలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న కాలీఫ్లవర్ ను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక సారి వేగిన తర్వాత అందులోనే రైస్ వేసి ఫ్రై చేయాలి.
- Step 7
మొత్తం మిశ్రమం కలగలిసేటప్పుడు 1/4చెంచా గరం మసాలా మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
- Step 8
చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే యమ్నీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ రైస్ రెడీ . దీన్ని లంచ్ లేదా డిన్నర్ కు సర్వ్ చేయవచ్చు.