- Step 1
గోధుమ రవ్వను నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత నీళ్ళ పోసి, రాత్రంతా నానెబట్టుకోవాలి.
- Step 2
తర్వాత రోజు ఉదయం, నీరు వంపేసి, క్లీన్ గా ఉండే టవల్ మీద ఆరబోయాలి. డ్రైగా మారిన తర్వాత, రఫ్ గా పొడి చేసుకోవాలి. రవ్వలా తయారవుతుంది. లేదా రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి. మరీ స్మూత్ గా లేకుండా చూసుకోవాలి.
- Step 3
తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకుని, స్టౌ మీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోధు పేస్ట్ ను వేసి, అతి తక్కువ మంట మీద 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 4
తర్వాత బెల్లం, పాలు, మరియు కొబ్బరి తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలిజ ఈ మిశ్రమం మరీ చిక్కబడుతున్నట్లు అనిపిస్తే మరికొద్దిగా పాలు జోడించుకోవచ్చు.
- Step 5
మొత్తం మిశ్రమం పాలతో కలిసి, కరిగిపోయాలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో డ్రై నట్స్ ను జోడించాలి. అలాగే యాలకల పొడి కూడా జోడించాలి మద్య మద్యలో కలియబెడతూ , మీడియం మంట మీద ఖీర్ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
- Step 6
పూర్తిగా ఉడికిన తర్వాత, ఈ ఖీర్ సర్వ్ చేయడానికి తగిన విధంగా పల్చగా కూడా ఉండేట్లు చూసుకోవాలి.
- Step 7
అంతే వీట్ ఖీర్ రెడీ. స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి .
- Step 8
చివరగా ఎండు ద్రాక్షతో గార్నిష్ చేసి, దేవుడుకి నైవేద్యం పెట్టాలి. తర్వాత ఇంటిల్లిపాదికి సర్వ్ చేసి కొత్త టేస్ట్ ను ఎంజాయ్ చేయాలి.