- Step 1
ముందుగ పిండిని తయారుచేసుకునే విధానం: పెద్ద బౌల్ తీసుకుని అందులో పన్నీర్ తురుము, మైదా, మరియు మిల్క్ పౌడర్ ను తీసుకోవాలి.
- Step 2
ఈ పదార్థాలన్నీ నీట్ గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా పాలు పోసి, పిండిని సాప్ట్ గా కలుపుకోవాలి.
- Step 3
ఇలా కలుపుకున్న పిండిని 10-15నిముషాలు పక్కన పెట్టుకోవాలి 15నిముషాల తర్వాత పిండిని నుండి కొద్దిగా తీసుకుని జామ్ ఉండల్లా చిన్న గా చుట్టుకోవాలి.
- షుగర్ సిరఫ్ తయారుచేసుకోవడానికి:
- Step 4
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2కప్పులు షుగర్ మరియు ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. అలాగే దీనికి యాలకలపొడి జోడించాలి. షుగర్ సిరఫ్ చిక్కగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.
- Step 5
షుగర్ సిరఫ్ రెడీ అయ్యేలోపు, స్టౌమీద డీప్ ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, కాగిన తర్వాత జామూన్ ఉండలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 6
ఇలా ఒకదాని తర్వాత పాన్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి తర్వాత 5 నిముషాల తర్వాత వీటిని షుగర్ సిరఫ్ లో వేసుకోవాలి జామూన్స్ షుగర్ సరిఫ్ లో బాగా నాని, సాప్ట్ గా తయారయ్యే వరకూ అందులోనే ఉంచాలి.
- Step 7
తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో పంచదార మరియు కొబ్బరి తురుము వేసి మిక్స్ చేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత షుగర్ సిరఫ్ లోని జామూన్స్ను బటయకు తీసి, పంచదార కొబ్బరి పొడిలో వేసి అన్ని వైపులా రోల్ చేయాలి.
- Step 8
ఇప్పుడు ఈ జామూన్స్ ను ఫ్రిజ్ లో పెట్టి రెండు గంటల సేపు అలాగే ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత బయటకు తీసి, టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామూన్ ను కూల్ కూల్ గా సర్వ్ చేయాలి. ఈ డ్రైగులాబ్ జామూన్ ను గణేష చతుర్థికి రెడీ చేసుకోవ్చచ్చు.