కొన్ని మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేసే ఈ ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, నోరూరించే విధంగా వుంటుంది. ఎవరైనా సరే.. దీనిని తినకుండా వుండలేరు. ఇక చేపలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసే వుంటుంది.
నిత్యం చేపలను తింటే కంటిసమస్యలు రాకుండా వుంటాయి. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరంలో నిల్వవుండే అనవసరమైన కొవ్వు పదార్థాలు కూడా చాలావరకు కరిగిపోతాయి. జీర్ణవ్యవస్థ ఎంతో మెరుగుగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య లక్షణాలు గల ఈ చేపలతో రకరకాల రిసిపీలను తయారుచేసుకుని తింటే ఎంతో మంచిది.
సాధారణంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరకమైన వంటకాలను తయారుచేస్తారు. ఇక్కడ చేపలనే ఉదాహరణగా తీసుకుందాం.. ఆయా ప్రాంతాలతో పోలిస్తే ఈ చేపలతో చేసే కర్రీలు ఎంతో ప్రత్యేకంగా వుంటాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకవిధంగా చేస్తే.. ఇతర రాష్ట్రాల్లో మరొకవిధంగా చేస్తారు.
ఇక క్రిస్పీ ఫిష్ ఫ్రైను కూడా రకరకాలుగా వండుతారు. కేరళ స్టైల్’లో వండే ఫిష్ ఫ్రై అయితే అమోఘమైన రుచిని కలిగి వుంటుంది. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి.. కేరళ స్టైల్’లో ఫిష్ ఫ్రైని ఎలా చేస్తారో తెలుసుకుందాం..