- Step 1
ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు,పసుపు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కలపాలి పిండి కలిపాకా దానిలో కొబ్బరి నూనె వేసి మరికాస్త కలపాలి.ఈ కలిపిన పిండిని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
- Step 2
తాజా కొబ్బరిని తురుముకోవాలి లేదా మిక్సీ ఉపయోగిస్తున్నట్లయితే నీళ్ళు పొయ్యకుండా తురుములాగ చేసుకోవాలి.
- Step 3
ఒక గిన్నెలో నీళ్ళూ తీసుకుని బెల్లం వేసి కరిగేంతవరకూ స్టవ్ మీద పెట్టాలి మలినాలుంటే తొలగించడానికి కరిగిన బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి.
- Step 4
వడకట్టిన మిశ్రమంలో తురిమిన తాజా కొబ్బరి, దంచి పెట్టుకున్న ఏలకులు వెయ్యాలి కొబ్బరి కలిపిన బెల్లాన్ని మరలా పొయ్యి మీద పెట్టి తేమ పోయి దగ్గర పడేంతవరకూ ఉడికించుకోని చల్లారనివ్వాలి.
- Step 5
కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ప్యాటీ లాగ చేసి దానిలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి ఉబ్బెత్తుగా లేకుండా మెల్లిగ తట్టాలి.ఇలాగే మిగిలిన పిండితో కూడా చేసుకోవాలి.
- Step 6
ఇప్పుడు చపాతీ వత్తుకునే పీట మీద కొంచం పిండి వేసి ఫిల్లింగ్ చేసి పెట్టుకున్న ప్యాటీలని కాస్త మందంగా బొబ్బట్ల లాగ వత్తుకోవాలి.
- Step 7
పెనం మీద నెయ్యి వేసి వత్తుకున్న బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. కాల్చిన బొబ్బట్ల మీద నెయ్యి వేసి సర్వ్ చెయ్యడమే.