- Step 1
ముందుగా పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడిఅయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, టమోటోలు, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 2
తర్వాత వీటిని మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. తర్వాత అందులో జీడిప్పు, కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 3
మసాలాను పెస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, గరం మసాలా, కారం, ధనియాలపొడి మరియు పసుపు వేయాలి.
- Step 5
మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు, టమోటోలు, క్యాప్సికమ్, పైనాపిల్, పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, ద్రాక్ష వేసి మిక్స్ చేయాలి.
- Step 6
తర్వాత దానికే కొద్దిగా నీరు మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. పైనాపిల్ జ్యూస్ ను టాపింగ్ గా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
- Step 7
చివరగా ఉప్పు వేసి కలపాలి. అంతే రుచికరమైన నవరతన్ కుర్మా రెడీ. ఈ రుచికరమైన డిష్ రోటీ, చపాతీ లేదా బటర్ కుల్చా, పీస్ పులావ్, గీ రైస్ కు అద్భుతంగా ఉంటుంది.