- Step 1
ముందుగా పాన్ లో ఆయిల్ వేయాలి(పాస్తా తయారుచేయడానికి ఎక్కువగా ఆలివ్ ఆయిల్ ను ఎంపిక చేసుకుంటారు)
- Step 2
నూనె వేడి అయ్యాక అందులో రెండు కప్పులు కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 3
లైట్ బ్రౌన్ కలర్ కు మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అయితే ఎక్కువ సేపు ప్రై చేయడానికి లేదు.
- Step 4
కార్న్ ఫ్రై చేసుకొన్న తర్వాత ప్లేట్ లోకి మార్చుకోవాలి .
- Step 5
ఇప్పుడు మరో పాన్ తీసుకొని పాస్తా మరియు సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి .
- Step 6
పాస్తా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా నూనె వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
- Step 7
పాస్తా మెత్తగా ఉడికిన తర్వాత అదనపు నీరు ఉంటే వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 8
ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు, ఫ్రైడ్ కార్న్, టమోటో సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీస్ మరియు మెయోనైజ్ వేసి మిక్స్ చేయాలి.
- Step 9
ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకొన్న పాస్తా వేసి సూట్ చేయాలి. అంతే రోస్టెడ్ కార్న్ పాస్తా రిసిపి రెడీ .