ఎక్కువ లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడానికి ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే వాకింగ్, జాగింగ్, ఎక్సర్’సైజ్, జిమ్’కి వెళ్లడం లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలా చేయడం మంచిదేకానీ.. అప్పుడప్పుడు అలసటతో ఆరోగ్యకరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
అలా కాకుండా ఆహారపదార్థాల్లో కాస్త మార్పులు తెచ్చుకుని, రోజూ వాటిని సేవిస్తే.. త్వరితంగా మార్పును గమనించవచ్చు. ఇందుకు చాలానే ఆహారాలు అందుబాటులో వున్నాయి. అటువంటివాటిలో క్యాబేజ్ పెప్పర్ సూప్ ఒకటి! ఈ సూప్’ను రోజూ సమయానుకూలంగా తాగితే.. బరువును కంట్రోల్’లో వుంచుకోవచ్చు.
క్యాబేజ్, పెప్పర్ మిశ్రమంతో తయారయ్యే ఈ సూప్’లో ఎన్నో పోషక విలువలు వుంటాయి. ముఖ్యంగా స్థూలకాయాన్ని తగ్గించే లక్షణాలు అధికంగా వుంటాయి. అలాగే జలుబు, దగ్గు, ఇంకా ఇతర చిన్న వ్యాధులు కూడా దూరమవుతాయి. ఇంతటి ఆరోగ్యకరమైన ఈ సూప్’ను ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...