- Step 1
ముందుగా పిండిని తయారుచేసుకోవాలి. అందుకోసం మైదా, కారం, బేకింగ్ పౌడర్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.
- Step 2
తర్వాత అందులో సోడా లేదా వైన్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- Step 3
మొత్తం మిశ్రమం ఒక 20నిముషాలు చల్లగా అవ్వనివ్వాలి.
- Step 4
తర్వాత అందులో ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
- Step 5
తర్వాత కార్న్ ఫ్లోర్ మరియు మైదాను ఒక ప్లేట్ లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి.
- Step 6
ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి.
- Step 7
ఇప్పుడు ఈ చేప ముక్కలను సోడా లేదా వైన్ మిశ్రమంలో డిప్ చేయాలి.
- Step 8
ఇప్పుడుమరో పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కాగిన తరవ్ాత డిప్ చేసిన చేపముక్కలను కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- Step 9
అంతే క్రిస్పీ ఫిష్ ఫ్రై రిసిపి రెడీ. వీటిని వేడి వేడిగా స్పైసీ సాన్ మరియు చిప్స్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.