- Step 1
ముందుగా మిక్సీ జార్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వాము, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు వేసి మసాలా పొడిని తయారుచేసుకోవాలి.
- Step 2
తర్వాత పేస్ట్ కోసం సిద్దంగా పెట్టుకొన్న పదార్థాలను వేరే జార్ లో వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి .
- Step 3
ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి బిర్యానీ ఆకులు, కస్తూరీమేథీ, కరివేపాకు వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
- Step 4
ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి అది వేగాక టమోటో ముక్కలు, కారం, ధనియాలపొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంట మీద వేగిస్తుంటే ఇది గ్రేవీలా తయారవుతుంది.
- Step 5
గ్రేవీలా ఉడికే సమయంలో అందులోనే కొబ్బరి పేస్ట్, ముందుగా తయారుచేసుకొన్న మసాలా పేస్ట్ వేసి బాగా కలగలిపి, 5నిముషాలు ఉడికించి 5 నిముషాల తర్వాత దింపేసుకోవాలి.
- Step 6
అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా పల్చగా కూడా తయారుచేసుకోవచ్చు.
- Step 7
అంతే టమోటో గ్రేవీ రిసిపి రెడీ. దీన్ని రోటీలతో కలిపి తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. వెరైటీ కావాలనుకుంటే టమోటో గ్రేవీలోనే కొన్ని రకాల కూరగాయముక్కలు లేదా ఉడికించిన మటన్ లేదా చిక్న్ లేదా కోడిగుడ్లు జత చేసి ఉడికించుకోవచ్చు.