- Step 1
ముందుగా ప్రెజర్ కుక్కర్లో కొద్దిగా ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు, కందిపప్పు, మరియు నీళ్ళు పోసి ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
- Step 2
తర్వాత చిన్న పాన్ తీసుకొని అందులో పచ్చిబియ్యం, ధనియాలు, ఉద్దులు, శెనగలు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి.
- Step 3
వేయించుకొన్న పదార్థాలు చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- Step 4
అదే జార్ లో చింతపండు గుజ్జు, కొబ్బరి తురుము, బెల్లం, కారం, కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
- Step 5
అంతలోపు కుక్కర్ చల్లబడి ఉంటుంది, ఉడికిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పును వేరే పాన్ లోకి మార్చుకొని మరికొద్దిగా నీళ్ళు పోసి చిన్న మంట మీద ఉడికించాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే మిక్సీలో గ్రైట్ చేసుకొన్న పేస్ట్, ఉప్పు కరివేపాకు వేసి 5-10 నిముషాలు ఉడికించాలి.
- Step 7
బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ప్లెయిన్ రైస్ విత్ గీతో పొటాటో ఆనియన్ సాంబార్ రిసిపిని సర్వ్ చేయాలి.