- Step 1
ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోయాలి. తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ వేసి చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి.
- Step 2
ఒక నిముషం తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేయాలి. వేడి అయిన తర్వాత అందులో స్వీట్ కార్న్, సన్నగా తరిగిన క్యాబేజ్ మరియు క్యారెట్ ముక్కలు వేయాలి.
- Step 4
తర్వాత 2లీటర్ల నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
- Step 5
ఇప్పుడు వాటికి పెప్పర్ పౌడర్ మరియు చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి.
- Step 6
తర్వాత అందులోనే చికెన్ కూడా వేసి మిక్స్ చేయాలి.
- Step 7
ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో నీరు మరియు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
- Step 8
ఈ మిశ్రమాన్ని పాన్ లో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలగలుపుకోవాలి.
- Step 9
ఈ మొత్తం మిశ్రమం అంతా 10-15నిముసాలు మెత్తగా ఉడకనివ్వాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. మరి ఈ హెల్తీ రిసిపిని మీరు కూడా ఎందుకు ట్రై చేయకూడదు.