- Step 1
చేపలను ముందుగా శుభ్రం చేసుకొని, కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. (ఒకవేళ ఒకే ఫిష్’తో ఫ్రై చేయాలనుకుంటే.. దానిని ముక్కలుగా కట్ చేసుకోకుండా ఆ చేప మధ్య భాగాల్లో గాట్లు పెట్టుకోవచ్చు. ఆ గాట్ల మధ్యలో మసాలా వేసి ఫ్రై చేసుకోవచ్చు.)
- Step 2
మరోవైపు ఆవాలు, వెల్లుల్లి, రెండు పచ్చిమిర్చి తదితర పదార్థాలను మిక్సీ జార్’లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీరు మిక్స్ చేసుకుంటే మంచిది.
- Step 3
ఆ విధంగా తయారుచేసుకున్న ఆ పసుపు మిశ్రమాన్ని ఇదివరకే శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు బాగా పట్టించాలి.
- Step 4
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని, వేడి చేయాలి. కాగిన అనంతరం అందులో మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి, మీడియం మంట మీద వేడి చేయాలి. (చేపముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి). ఫ్రై చేసిన తర్వాత ప్లేటులో తీసి, పక్కన పెట్టుకోవాలి.
- Step 5
అదే పాన్’లో మరోసారి కాస్త నూనెను జోడించి వేడి చేసిన తర్వాత అందులో జీలకర్ర వేసి వేగించాలి. తర్వాత ఆవాల పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపటివరకు వేడి చేయాలి.
- Step 6
అలా వేడి చేసిన తర్వాత అందులో కాస్త నీళ్లు జోడించి, తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలను వసి వేడి చేయాలి. గ్రేవీ చిక్కబడే వరకు బాగా ఉడికించాలి.
- Step 7
బాగా ఉడికిన అనంతరం స్టౌవ్ ఆఫ్ చేయడానికి ముందు చేప మీద మస్టర్డ్ ఆయిల్ వేసి, పచ్చిమిర్చి - కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే! ఈ విధంగా పాంఫ్రెట్ మస్టర్డ్ ఫ్రైను తయారుచేసుకోవచ్చు.