- Step 1
ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత పాన్ లో కొద్ది నూనె వేసి వేడి చేసి, అందులో బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- Step 3
తర్వాత అందులోనే పాలక్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలక్ పూరీ పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- Step 4
తర్వాత అందులో ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న ఆలూ, గ్రీన్ చట్నీ కూడా వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 5
గ్రీన్ చట్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యంను అందులో వేసి మొత్తం కలగలిసేలా కలపాలి.
- Step 6
అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆలూ చట్నీ పులార్ రిసిపి రెడీ.