- Step 1
ముందుగా పుదీనా శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. నీరు మొత్తం వడలిపోయే వరకూ పక్కన పెట్టుకోవాలి
- Step 2
తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, మొదట పచ్చిమిర్చి వేగించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
అదే నూనెలో పుదీనా మెత్తబడే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. మద్యమద్యలో కలియబెట్టడం వల్ల పాన్ కు అట్టుకోకుండా ఉంటుంది.
- Step 4
తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసి ఒకనిముషం లైట్ గా వేగించుకోవాలి.
- Step 5
ఇప్పుడు వేగించుకొన్నపదార్థాలను మిక్సీ జార్లో వేయాలి,. వీటితో పాటు లిస్ట్ లో ఉన్న మిగిలిన పదార్థాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- Step 6
స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
- Step 7
అంతే టేస్టీ అండ్ హెల్తీ గ్రీన్ పుదీనా చట్నీ రెడీ. అవసరం అయితే పోపులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ ఇండియన్ గ్రీన్ చట్న, వేడి వేడి దోస, ఇడ్లీ, చపాతీ, మరియు సమోసాలకు గ్రేట్ కాంబినేషన్.