- Step 1
ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో రొయ్యల్ని పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి.
- Step 2
మరో పాన్ లో మరికొద్దిగా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి రెండు నిమిషాలు వేగించాలి.
- Step 3
ఇప్పుడు అందులోనే రొయ్యలు, కారం, దనియాలపొడి కలిపి మరికొద్దిసేపు వేగించాలి.
- Step 4
తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి.
- Step 5
రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాల పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది. (ఇష్టమైతే పాలకూర తరుగు బదులు దాన్ని ఉడికించి, పేస్టుచేసి కూడా కలుపుకోవచ్చు). అంతే పాలక్ ప్రాన్ కర్రీ రెడీ...