- Step 1
కాలీ ఫ్లవర్‌ను విడదీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు గిన్నెలో శెనగపిండి, మొక్క జొన్న పిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా గంటెజారుగా కలుపుకోవాలి.
- Step 3
తర్వాత పాన్ లో తగినంత నూనె పోసి కాగిన తరువాత పై మిశ్రమంలో ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టు కోవాలి.
- Step 4
ఉల్లిపాయ ముక్కలు కొన్నింటిని, టమోటా ముక్కలను కలిపి ముద్దగా చేసుకొని అదే నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి వేయించుకోవాలి.
- Step 5
ఇవి బాగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, మిగిలిన కారం, టమోటా సాస్, రుబ్బిపెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు ఉడికించాలి.
- Step 6
ఇది గట్టిపడుతున్న సమయంలో వేయించిపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను జత చేసుకోవాలి. సన్నపు సెగన కూర గట్టిపడేంత వరకూ ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది వేడి వేడి అన్నం లేదా చపాతీల్లోకి మంచి రుచిగా వుంటుంది.