- Step 1
ఉల్లిపాయలను సన్నగా తరిగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, బంగాళదుంప మరియు స్వీట్ కార్న్ వేయాలి . అలాగే కొద్దిగా నూనె మరియు సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి 3విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
- Step 3
మరో పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, మరియు పచ్చిమిర్చి వేసి వేగించాలి.
- Step 4
అంతలోపు కుక్కర్ లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి.
- Step 5
కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ కార్న్ రైస్ ను బయటకు తీసి పాన్ లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్వీట్ అండ్ స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి రెడీ...