- Step 1
ముందుగా పనీర్ ను నచ్చిన షేపులో కట్ చేసుకోవాలి.
- Step 2
తర్వాత ఉల్లిపాయ, టమోటోట, అల్లం వెల్లుల్లిని మెత్గగా పేస్ట్ చేసుకోవాలి .
- Step 3
అలాగే కొత్తిమీర, ఎండుమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి వేరుశెనగలు కూడా వేయించుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి .
- Step 4
ఇప్పుడు కొబ్బరి పాలను తయారుచేసుకోవడానికి...ఫ్రెష్ గా ఉండే కొబ్బరిని సన్నగా తురుముకోవాలి. తురుమును మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అందులో ఒక గ్లాస్ నీరు మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకుంటే కోకనట్ మిల్క్ రెడీ.
- Step 5
ఇలా అన్ని సిద్దం చేసుకన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నెయి వేసి వేడి చేయాలి.
- Step 6
నెయ్యి వేడెక్కాక, అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడి వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక్క నిముషం వేగించుకోవాలి.
- Step 7
కొద్దిసేపటి తర్వాత అందులో టమోటో మరియు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉడికించడం వల్ల నూనె సెపరేట్ అవుతుంది.
- Step 8
నూనె పైకి తేలుతున్న సమయంలో ధనియాలపొడి, కారం, ఉప్పు, పంచదార పొడి కొబ్బరి పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
- Step 9
చివరగా పనీర్ ముక్కలు వేసి గ్రేవీ చిక్కబడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. పనీర్ మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే పనీర్ కోకనట్ గ్రేవీ రెడీ.