- Step 1
ముందుగా స్టఫింగ్ కోసం సిద్దం చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో జీలకర్ర, వేసి వేగించాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చిు ముక్కలు వేసి వేగించుకోవాలి.
- Step 2
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప , ఉప్పు, కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
- Step 3
అంతలోపు బ్రెడ్ స్లైస్ తీసుకొని నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీటి నుండి ఒక్క స్లైస్డ్ పీస్ తీసుకొని పాలలో డిప్ చేసి వెంటనే తీసేయాలి.
- Step 4
జస్ట్ డిప్ చేసి బయటకు తీయడం వల్ల మరీ సాఫ్ట్ కాకుండా ఉంటుంది.
- Step 5
ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్ గా స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని బ్రెడ్ పీస్ సెంటర్లో పెట్టాలి . ఇప్పుడు బ్రెడ్ ను నాలుగు వైపులా కవర్ చేయాలి.
- Step 6
పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకొన్న బ్రెండ్ బోండాలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
- Step 7
బోండాలు అన్ని వైపులో బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత పాన్ లో నుండి సర్వింగ్ ప్లేట్ లోని తీసుకోవాలి .
- Step 8
ఈ హాట్ అండ్ స్పైసీ బ్రెడ్ బోండాను సాస్ తో పాటు సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది .