- Step 1
గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, నూనె కలిపి తగినంత నీటితో ముద్దలా చేసుకొని అరగంట పక్కనుంచాలి.
- Step 2
ఒక గిన్నెలో బఠాణి, చిటికెడు పంచదార కలిపి కుక్కర్లో (జున్ను తయారీలా) ఉడికించాలి.
- Step 3
చల్లారిన తర్వాత అల్లం, పచ్చిమిర్చిలతో పాటు బరకగా రుబ్బుకొని, ఉప్పు, మసాల పొడి, పసుపు, వాము/జీలకర్ర, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- Step 4
పిండిని పూరీల్లా వత్తి, మఽధ్యలో బఠాణి మిశ్రమం పెట్టి మడచి (మరీ పలచగా వత్తితే లోపలి మిశ్రమం బయటకి వస్తుంది కాబట్టి) కొద్దిగా దళసరిగా పరాటాలు చేసుకొని నెయ్యితో పెనంపై దోరగా కాల్చుకోవాలి. ఈ పరాటాలకు పెరుగు చట్నీ మంచి కాంబినేషన్.