కొన్ని వంటకాలు ప్రాంతాలవారీగా ఎంతో ఫేమస్ అయి వుంటాయని తెలిసిందే! ఏ విధంగా అయితే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయిందో.. అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఫేమస్ అయి వుంటాయి. అందులో భాగంగా ‘పంజాబీ దాల్ తడ్కా’ ఒకటి!
నిజానికి దాల్ తడ్కా వంటకం అన్నిప్రాంతాల్లోనూ తయారుచేస్తారు కానీ.. వాటన్నింటికంటే పంజాబీ దాల్ తడ్కా చాలా ఫేమస్! ఇతర వంటకాలతో పోల్చుకుంటే ఇది ఎంతో రుచికరంగా వుంటుంది. మసాలా దినుసులు జోడించి తయారయ్యే ఈ వంటకం ఎంతో టేస్టీగా వుంటుంది. పంజాబ్’లో ఈ వంటకం ఎంత ఫేమస్ అంటే.. చివరకు ఢాబాల్లో కూడా దీని డిమాండ్ చాలావరకు వుంటుంది.