- Step 1
ముందుగా స్టౌవ్ మీద గిన్నె పెట్టి కోవా, శెనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి.
- Step 2
అందులో జాపత్రిపొడి, యాలకులపొడి, పంచదారం కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మైదాపిండిలో వంటసోడా, బేకింగ్ పౌడర్, నెయి, కొద్దిగా నీళ్లు కలిపి గట్టి ముద్దలా చేసుకోవాలి.
- Step 4
తర్వాత చిన్న నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీల్లా కొంచెం మందంగా వత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల్లా మడుచుకోవాలి.
- Step 5
ఇప్పుడు ఒక గిన్నెలో చక్కర పోసి రెండు గ్లాసుల నీళ్లు పోసి లేత తీగపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇప్పుడు కజ్జికాయల్ని నూనెలో వేయించి గోధుమ రంగు రాగానే తీసి గోరు వెచ్చని చక్కెరపాకంలో వేసి ముంచి తీయాలి. అంతే కోవా పూరీలు రెడీ.