అందరూ నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే.. అందుకు తగినట్లుగానే నాణ్యత గల ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అంటే.. పోషక విలువలు ఎక్కువగా నిల్వవుండే పదార్థాలనే ఎక్కువ సేవించాలి. అవి చాలావరకు వెజిటేబుల్స్’లోనే లభ్యమవుతాయి.
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇతర రకరకాల ఆహారప పదార్థాలను ప్రతిరోజూ సేవిస్తే.. అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది. శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా పెరిగిపోయి బరువు పెరగడం, తర్వాత గుండె సంబంధిత వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. కాబట్టి.. అటువంటి ఆహారాల నుంచి దూరంగా వుండి, పోషకాలు వుండే వెజిటేబుల్స్’తో తయారుచేసిన వంటకాలను తీసుకుంటే ఆరోగ్యంగా వుండటంతోబాటు చురుకుగా అన్ని వ్యవహారాల్లోనూ పాల్గొనవచ్చు.
అటువంటి ఆరోగ్యకరమైన ఆహారవంటకాల్లో ఆలూ - గోభీ రిసిపీ ఎంతో ఉత్తమమైనది. ఈ రెండు వెజిటేబుల్స్ కాంబినేషన్’తో తయారయ్యే ఈ వంటకంలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీనులు, ఖనిజాలు, ఐరన్, ఇతర పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. అవి శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాలతో పోరాడి, చిన్నచిన్న జబ్బుల నుంచి కాపాడుతాయి. కొవ్వుశాతాన్ని తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇలా అన్ని రకాలుగా ఈ వంటకం ఉపయోగకరమైంది.