- Step 1
ముందుగా జీడిపప్పు, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ సుకోవాలి. జీడిపప్పుతో పాటు టమోటోలను కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఇప్పుడు పాన్ తీసుకొని అందులో నూనె వేసి శుభ్రచేసిన చికెన్ ముక్కలు వేసి , షాలో ఫ్రై చేసుకోవాలి.
- Step 3
చికెన్ కొద్దిగా వేగిన తర్వాత అందులో స్వీట్ కార్న్ వేసి వాటిని కూడా చికెన్ తో కలిపి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 4
ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ,జీడిపప్పు, టమోటో పేస్ట్ వేసి ఫ్రై చేసి, కొద్దిగా నీరు జోడించి ఉడికించుకోవాలి.
- Step 5
ఇప్పుడు అందులోనే ఫ్రైడ్ చికెన్ మరియు స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి.
- Step 6
తర్వాత గరం మసాలా , ధనియాలపొడి రెడ్ చిల్లీపౌడర్ వేసి , సరిపడా సాల్ట్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఉడికించుకోవాలి.
- Step 7
మొత్తం మిశ్రమం పదినిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే చికెన్ కార్న్ గ్రేవీ రిసిపి రెడీ.