గుడ్డులో ఔషధ విలువలు ఎంతమేరకు వున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రోజూ చొప్పున ఒక గుడ్డు తింటే ఎంతో ఆరోగ్యమని డాక్టర్లు కూడా సలహాలు ఇస్తారు. అంతెందుకు... గుడ్డు ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు అక్టోబర్ 2వ తేదీన ‘వరల్డ్ ఎగ్ డే’ అని ఫెస్టివల్ కూడా జరుపుకుంటారు. దీంతో అర్థం చేసుకోవచ్చు.. గుడ్డులో ఎన్ని పోషకాలున్నాయో.. వాటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో..!
అటువంటి పౌష్టికాహారమైన గుడ్డుతో ఎన్నోరకాల వంటకాలను తయారుచేయొచ్చు. గుడ్డుతో తయారుచేసే ఏ వంటకాన్నైనా తినొచ్చు. అందులో భాగంగా ‘‘ఎగ్ సేమియా’’ వంటకం ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఎంతో రుచిగా వుండటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది కూడా! ఇతర వంటకాలతో పోల్చుకుంటే.. ఇది చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా వుండే ఈ రిసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...