- Step 1
1ముందుగా కుక్కర్లో 3 రకాల పప్పును ఉడికించి పక్కన పెట్టాలి.
- Step 2
2ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరయిు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి.
- Step 3
3తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి.
- Step 4
4తర్వాత అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న దాల్ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి. ఉండలుకట్టకుండా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
- Step 5
5తర్వాత మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి, అందులో ఇంగువ వేసి ఒక సెకను వేగించాలి.
- Step 6
6తర్వాత అందులో గుడ్లను పగులగొట్టి అందులో పోసి కొద్దిగా ఉప్పు చిలకరించి, ఫ్రై చేసుకోవాలి.
- Step 7
7గుడ్డు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పును ఇందులో పోయాలి . రెండింటి మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా జోడించాలి అంతే దాల్ తడ్కా రెడీ.