- Step 1
వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టకోవాలి.
- Step 2
ఒక గిన్నెలో కొద్దిగా నూనెవేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి పెట్టకోవాలి.
- Step 3
ఈ మొత్తానికి వేయించిన శనగగుళ్లు, పుట్నాల పప్పు, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 4
తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దాన్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దోరగా వేగాక కరివేపాకు వేయాలి.
- Step 5
తరువాత ఆ పోపులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీల చట్నీని వేయాలి.
- Step 6
ఈ పల్లీల చట్నీని రాగిముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. రాయలసీమ వాసులు రాగిముద్దలోకి ఈ పల్లీల చట్నీని ఇష్టంగా తింటారు.