- Step 1
ఉసిరికాయలను గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
టమాటాలను పెద్ద ముక్కలుగా, ఉల్లిపాయలను మామూలు సైజ్‌ల్లో కట్ చేయాలి.
- Step 3
కుక్కర్‌లో కందిపప్పు, ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి, నీళ్లు పోసి ఉడికించాలి.
- Step 4
మెత్తగా అయ్యేవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉప్పువేసి పప్పు సుద్దతో బాగా మెదపాలి.
- Step 5
ఇప్పుడు కడాయిలో నూనె పోసి.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి.
- Step 6
దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి పోపు చేయాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో వేసి కలపాలి.
- Step 7
ఉసిరికాయ పప్పును వేడి అన్నంతో కలిపి ఆరగించేయొచ్చు.