- Step 1
చిక్కుడుగింజలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కలిపి కుకర్‌లో ఉడికించాలి.
- Step 2
పల్లీలు, ధనియాలు వేయించి చల్లారాక, ఎండుకొబ్బరి, వెల్లుల్లిరేకలు జత చేసి మిక్సీలో వేసి పొడి చేయాలి.
- Step 3
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి.
- Step 4
కరివేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, టొమాటో ముక్కలు జతచేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి.
- Step 5
చిక్కుడుగింజలు, పసుపు, కారం వేసి బాగా కలిపి, గ్రైండ్ చేసి ఉంచుకున్న పొడి జల్లి మూత పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి, దించే ముందర కొత్తిమీర చల్లాలి.