తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! చిన్నిపిల్లల నుంచి పెద్దలవరకు స్వీట్ పదార్థాలను ఎంతో అమితంగా తింటారు. ముఖ్యంగా భోజనం అయిపోయిన వెంటనే స్వీట పదార్థం తప్పనిసరి! ఈ తీపి పదార్థాలను ఏ విధంగానైనా తయారుచేసుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లలో లభించే స్వీట్లకంటే.. ఇంట్లో తయారుచేసుకుని తినడమే ఎంతో శ్రేయస్కరం.
సాధారణంగా ఇళ్లలో సెమియాలు, రవ్వ, బియ్యం తదితర పదార్థాలతో స్వీట్ చేస్తారు. ఇతర పదార్థాలు ఎలా చేయాలనే అవగాహన వుండదు కాబట్టి.. వారికి వేరే ఆప్షన్ వుండదు. కానీ ఇక్కడ బాదాం కా హల్వా ఎలా తయారుచేస్తారో అందుకు తగిన టిప్స్ మీకోసం..