మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మానవ శరీరానికి చిరుజబ్బులు వస్తుండటం, పోతుండటం సర్వాసాధారణమే! కాలానికి తగ్గట్టు జలుబు, దగ్గు, నొప్పులు, ఇంకా ఇతరత్ర చిరువ్యాధులు వస్తుంటాయి. అయితే అటువంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా వుండాలంటే మెడిసిన్లతోబాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వుంటుంది. అంటే.. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాలు ఏంటో తెలుసుకుని తింటే చాలా మంచిది.
ఇక చలికాలం వస్తే.. పరిస్థితులు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నిరకాల చిరుజబ్బులు నీడలా మనల్ని వెంటాడుతూనే వుంటాయి. మరి వాటినుంచి సురక్షితంగా వుండాలంటే అందుకు ‘చికెన్ మష్రూమ్ సూప్’ ఎంతో శ్రేయస్కరం. ఇది చిరుజబ్బుల నుంచి దూరంగా వుంచడంతోబాటు మరింత ఆరోగ్యంగా, సౌష్టవంగా వుండేలా చేస్తుంది. శరీరంలో శక్తిసామర్థ్యల స్థాయిని పెంచుతుంది. పైగా రుచికరంగా వుంటుంది. మరి దీనిని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...