- Step 1
గోధుమపిండిలో సొరకాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తురుము, కసూరిమెంతి, కారం, పసుపు, చాట్ మసాలా, నూనె వేసి ముద్దలా కలపాలి.
- Step 2
సొరకాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు ప్రత్యేకించి నీళ్లు పోయనక్కర్లేదు.
- Step 3
ఒకవేళ పిండి మరీ జారుగా అయితే మరికొంచెం గోధుమపిండి కలపండి.
- Step 4
మెత్తటి ముద్ద తయారుచేసుకున్న తరువాత దాన్నుంచి పది చిన్న చిన్న ఉండలు చేయాలి.
- Step 5
ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడి చేయాలి.
- Step 6
అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి.
- Step 7
వీటిని వేడెక్కిన పెనం మీద వేసి ఎర్రటి మచ్చలు వచ్చే వరకు కాల్చాలి.
- Step 8
ఆ తరువాత రెండో వైపు తిప్పి పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండో వైపు కూడా చేయాలి.
- Step 9
రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు. ప్రయాణాల్లో వీటిని వేడివేడి టీతో కలిపి తిన్నా బాగుంటాయి.