- Step 1
మినప్పప్పును సుమారు 4 గంటల సేపు నానబెట్టాలి.
- Step 2
మామిడి తురుములో సరిపడా ఉప్పు కలిపి, కొద్దిసేపు అలాగే ఉంచి, తరువాత మామిడి తురుములో ఉండే నీరంతా గట్టిగా పిండి తీసేయాలి.
- Step 3
పెరుగులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, క్యారెట్ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
- Step 4
స్టవ్ మీద బాణలి ఉంచి అందులో రెండు చెంచాల నూనె పోసి కాగాక, తాలింపు గింజలను వేసి వేయించి, పెరుగులో కలపాలి నానబెట్టుకున్న మినప్పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్ లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి.
- Step 5
మామిడి తురుము, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మరో మారు రుబ్బాలి.
- Step 6
బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక రుబ్బి ఉంచుకున్న పిండిని గారెల్లాగా వేయాలి.
- Step 7
వేగిన గారెలను ఒక నిమిషం పాటు నీటిలో ఉంచి తీసి పెరుగులో వేయాలి. డ్రై ఫ్రూట్స్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే మామిడి ఆవడలు రుచిగా ఉంటాయి.