ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్’లో ప్రతిఒక్కరు ఉదయం వేళ బ్రేక్’ఫాస్ట్ చేడానికి ఉపక్రమించడం లేదు. ఉదయాన్నే లేవగానే ఆఫీసు వేళ కావడంతో హడావుడిగా వెళ్లిపోవాల్సి వస్తుంది. దాంతో మధ్యాహ్నం వరకు పొత్తికడుపుతోనే వుండిపోతారు. ఇలా రెగ్యులర్’గా నడిస్తే ఎన్నో ఆరోగ్యసమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి... ఉదయాన్నే లేవగానే బ్రేక్’ఫాస్ట్ చేయడం ఎంతో ముఖ్యం.
ఉదయాన్నే టిఫిన్ చేయడానికి సమయం లేకపోతే.. అందుకు ఒక ఉపాయం వుంది. అదే నూడిల్స్. తమను తాము రెడీ చేసుకొంటూనే తక్కువ సమయంలోనే బ్రేక్’ఫాస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. పైగా ఇది ఎంతో రుచికరంగా వుండటంతోబాటు చురుకుగా వుండేలా చేస్తుంది. ఉదయాన్నే దినచర్యను మార్చేసి, ఉత్తేజంగా వుండేలా చేస్తుంది. మరి ఈ టేస్టీ, హెల్తీ నూడిల్స్’ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...