- Step 1
ఉల్లిపాయ, పనీర్‌లను విడివిడిగా సన్నగా తరగాలి. బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కల్ని వేసివేయించాలి.
- Step 2
పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి.
- Step 3
బ్రెడ్ ముక్కల అంచులు తీసేసీ.. త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి.
- Step 4
విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్ ముక్కల మిశ్రమంలో కలపాలి.
- Step 5
కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద ఈ మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి.
- Step 6
ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని.. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి.
- Step 7
అంతే పనీర్ బ్రెడ్ రెడీ.. ! వీటిని టమాటో సాస్ లేదా చింతకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.