- Step 1
గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టి ముద్దలా కలపాలి.
- Step 2
మెదిపిన చిలగడదుంపల్లో పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, పుదీనా, ధనియాలు-జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలాలతో పాటు నిమ్మరసం, ఉప్పు వేసి మెత్తటి ముద్దలా కలపాలి.
- Step 3
ఈ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. ముందు కలిపి పెట్టిన పిండి ముద్ద నుంచి కొంచెం పిండిని తీసుకుని, నూనె చేతులకి రాసుకుని కప్పు ఆకారంలో చేయాలి.
- Step 4
ఇందులో చిలగడదుంప ఉండని ఉంచి కప్పుని మూసేసి చదునుగా చేసి పరాఠాలా ఒత్తాలి.
- Step 5
తరువాత పెనం మీద వేసి ఓ మాదిరిమంట మీద రెండువైపులా కాల్చాలి. తరువాత వాటికి నెయ్యి పూసి మంట పెంచి ముదురు రంగు వచ్చే వరకు వేగించాలి.
- Step 6
ఈ పరాఠాల్ని వేడివేడిగా నచ్చిన చట్నీతో లాగించొచ్చు.