- Step 1
పాలను వేడిచేసి చల్లార్చుకోవాలి. మైదాలో బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.
- Step 2
దీంట్లో చక్కెర, చల్లని పాలు, పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి.
- Step 3
దీనిపై ఒక మెత్తని వస్త్రం కప్పి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి.
- Step 4
ఈలోపు పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి.
- Step 5
ఒక గిన్నెలో పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, చాట్‌మసాలా వేసి కలపాలి.
- Step 6
ఇప్పుడు మైదాను తీసుకొని చిన్నచిన్న ఉండలుగా చేసి చపాతీల్లా ఒత్తుకోవాలి.
- Step 7
దీంట్లో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి మళ్లీ చిన్న ముద్దలా చేయాలి. మళ్లీ కొద్దిగా పిండి, నువ్వులు వేస్తూ చపాతీల్లా చేసుకోవాలి.
- Step 8
ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేస్తూ సన్నని మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి.
- Step 9
వేడి.. వేడి.. పన్నీర్ కుల్చా రెడీ! వీటిని బఠాణీలతో చేసినా ఏ కూరతోనైనా లాగించేయొచ్చు.