- Step 1
ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి .
- Step 2
ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి .
- Step 3
వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి
- Step 4
మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి .
- Step 5
పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి తయారుచేసి ఉంచుకున్న పకోడీలను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.